Inhalers A-Z

ఇన్హేలర్ల రకాలు

ప్రపంచవ్యాప్తంగా, ఆస్తమా మరియు సిఒపిడి లాంటి అనేక శ్వాస సమస్యలకు ప్రాథమిక చికిత్సగా ఇన్హేలర్లు సాధారణంగా అంగీకరించబడ్డాయి. ఇన్హేలర్ల ద్వారా రెండు రకాల మందులను తీసుకోవచ్చు- కంట్రోలర్స్ (ఇవి మీ లక్షణాలను నియంత్రించడానికి సహాయపడతాయి) మరియు రిలీవర్స్ (ఒకవేళ ఎటాక్ కలిగితే ఇవి తక్షణం ఉపశమనం ఇస్తాయి). పీల్చిన మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది కాబట్టి, ఆస్తమా మరియు సిఒపిడి లక్షణాలను నియంత్రించేందుకు మరియు చికిత్స చేసేందుకు ఇన్హేలర్లు సురక్షితమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గంగా నిరూపించబడ్డాయి. 

మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఇన్హేలర్ డివైసులను 4 కేటగిరిలుగా వర్గీకరించవచ్చు-ప్రెషరైజ్డ్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్లు (పిఎండిఐలు), డ్రై పౌడర్ ఇన్హేలర్లు (డిపిఐలు), బ్రీత్ యాక్చుయేటెడ్ ఇన్హేలర్లు (బిఎఐలు) మరియు నెబులైజర్లు

  1. ప్రెషరైజ్డ్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్లు (పిఎండిఐలు)

పంప్ ఇన్హేలర్లుగా కూడా తెలిసిన ఇవి అత్యంత సామాన్యంగా ఉపయోగించే ఇన్హేలర్ డివైసులు. ఇవి ప్రొపెల్లంట్ ఆధారితమైనవి మరియు నిర్దిష్టమైన, ముందుగా కొలిచిన మొత్తంలో ఊపిరితిత్తులకు మందును పీల్చవలసిన ఏరోసోల్ స్ప్రే రూపంలో వెళుతుంది. యాక్చువేషన్ పై ప్రతి సమయంలో పునరుత్పత్తిచేయగల మోతాదులను ఇది విడుదల చేస్తుంది. అంటే ప్రతిసారి ఒకే మొత్తంలో మోతాదు విడుదల చేయబడుతుంది. ఔషధం విడుదల కావడాన్ని ప్రేరేపించేందుకు రోగి పీల్చడంపై ఈ ఇన్హేలర్లు ఆధారపడవు. మోతాదును పీల్చడం మరియు కానిస్టర్ యొక్క యాక్చువేషనుకు మధ్యలో వీటికి సమన్వయం కావాలి. దీన్ని సరళంగా చెప్పాలంటే, కానిస్టరును నొక్కిన మరుక్షణంలో మీరు తప్పకుండా పీల్చాలి మరియు మోతాదును విడుదల చేయాలి. పిఎండిఐలు మోతాదు కౌంటరుతో కూడా వస్తూ, డివైసులో మిగిలిపోయిన పఫ్ల సంఖ్య జాడ తెలుసుకోవడాన్ని సులభం చేస్తుంది.

 

లింకు: https://www.youtube.com/watch?v=qFXf7RUavMM

వాడకాన్ని సులభతరం చేసేందుకు పిఎండిఐకి యాడ్ ఆన్ లుగా ఉపయోగించగల కొన్ని డివైసులు ఉన్నాయి.

జెరోస్టాట్ విటి స్పేసర్

పిఎండిఐ యాక్చువేషన్ తరువాత కొద్ది సేపు ఈ డివైసు మందు ఉంచుకుంటుంది. కాబట్టి, యాక్చువేషన్ కోసం కానిస్టరును నొక్కితే ఒకే సమయంలో ఖచ్చితంగా మీరు పీల్చకపోతే, మందు మొత్తాన్ని పీల్చడానికి స్పేసర్ మీకు సహాయపడుతుంది.

లింకు: https://www.youtube.com/watch?v=lOv0ODD6Vd4

బేబీ మాస్క్

మీరు లేదా మీ శిశువు జెరోస్టాట్ విటి స్పేసరు యొక్క మౌత్ పీస్ ని సరిగ్గా పట్టుకోలేకపోతే, జెరోస్టాట్ విటి స్పేసరుకు మీరు బేబీ మాస్కును జతచేయవచ్చు మరియు అనంతరం పిఎండిఐని ఉపయోగించండి.

లింకు: https://www.youtube.com/watch?v=4y-PG500fFU

హఫ్ పఫ్ కిట్

స్పేసర్ మరియు బేబీ మాస్క్ హఫ్ పఫ్ కిట్ లో ముందుగా అసెంబుల్ చేసి వస్తాయి. దీన్ని ముందుగా అసెంబుల్ చేస్తారు కాబట్టి, ఒకవేళ అత్యవసరమైతే మందు త్వరగా డెలివర్ కావడానికి సహాయపడుతుంది మరియు సమయం ఆదా అవుతుంది.
 

లింకు: https://www.youtube.com/watch?v=emLVSoIwKmg

  1. డ్రై పౌడర్ ఇన్హేలర్లు (డిపిఐలు)

ఈ రకాల ఇన్హేలర్లు డ్రై పౌడరు రూపంలో మందును డెలివర్ చేస్తుంది. డిపిఐలు అనేవి బ్రీత్-యాక్చువేటెడ్ డివైసులు, ఇవి డివైసు నుంచి మందును విడుదల చేయడానికి, మీ ఇన్హలేషనుపై ఆధారపడి ఉంటాయి. పిఎండిఐలతో పోల్చుకుంటే, వీటిని ఉపయోగించడం సులభం ఎందుకంటే వాటికి ప్రొపెల్లంట్స్ మరియు సమన్వయం అవసరం లేదు. సాధారణంగా, డిపిఐలు అనేవి సింగిల్ మోతాదు సాధనాలు, కాకపోతే బహుళ మోతాదు డిపిఐలు కూడా లభిస్తాయి.

రెవొలైజర్

రెవొలైజర్ అనేది ఉపయోగించడానికి సులభంగా ఉండే డిపిఐ, సాధారణంగా వివిధ రోటాక్యాప్ లతో ఉపయోగిస్తారు. ఇది మందును ఖచ్చితమైన మోతాదులో అందిస్తుంది మరియు మరింత సమర్థవంతంగా, పీల్చుకునే ప్రవాహ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా, విడుదల చేస్తుంది.

 

లింకు: https://www.youtube.com/watch?v=7WYrSinFtgY

 

రోటాహేలర్

పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది, మీరు మందు యొక్క మోతాదు మొత్తాన్ని పీల్చుకున్నారని నిర్థారించుకునేందుకు రోటాహేలర్ మీకు వీలు కల్పిస్తుంది.

లింకు: https://www.youtube.com/watch?v=mDXwrPCRl_M

  1. బ్రీత్ యాక్చుయేటెడ్ ఇన్హేలర్లు (బిఎఐలు)

పిఎండిఐ టెక్నాలజీ యొక్క అధునాతన టెక్నాలజీ అయిన, పిఎండిఐ మరియు డిపిఐ యొక్క ప్రయోజనాలను బ్రీత్ యాక్చుయేటెడ్ ఇన్హేలర్ సమ్మిళితం చేస్తోంది. యాక్చుయేటర్ ద్వారా మీ ఇన్హలేషన్ ని బిఎఐ పసిగడుతుంది, మరియు మందు ఆటోమేటిక్ గా విడుదల అవుతుంది.

ఆటోహేలర్

పిఎండిఐ మరియు కొన్ని డిపిఐల కంటే ఆటోహేలరును ఉపయోగించడం చాలా సులభం. ప్రతి ఒక్కరూ, అంటే పిల్లలు, వయోజనులు మరియు వృద్ధులు ప్రభావవంతంగా దీన్ని ఉపయోగించవచ్చు.

లింకు: https://www.youtube.com/watch?v=P0oD2VOaLVY

  1. నెబులైజర్లు

పిఎండిఐలు మరియు డిపిఐల మాదిరిగా కాకుండా, నెబులైజర్లు ద్రవ మందును అనువైన ఏరోసోల్ డ్రాప్ లెట్సులోకి మార్చుతుంది, ఇవి పీల్చుకోవడానికి ఉత్తమంగా అనువైనవి. నెబులైజర్లకు సమన్వయం అవసరం లేదు మరియు మందును త్వరగా మరియు ప్రభావవంతంగా ఊపిరితిత్తులకు తుంపరల రూపంలో విడుదల చేస్తుంది. చిన్నపిల్లల్లో, పిల్లల్లో, వృద్ధుల్లో, క్రిటికల్, అపస్మారక రోగుల్లో మరియు పిఎడిఐ లేదా డిపిఐని ప్రభావవంతంగా ఉపయోగించలేనివారిలో ఆస్తమా ఎటాక్‌లలో నెబులైజర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

లింకు: https://www.youtube.com/watch?v=OrsIbHWxVlQ