Inhalers A-Z

ఇన్హేలర్ల విషయంలో చేయవలసినవి మరియు చేయకూడనివి

ఆస్తమా మరియు సిఒపిడి లాంటి మీ శ్వాస సమస్యలకు చికిత్స చేసే విషయానికొస్తే, ఇన్హేలర్లు మీకు ఉత్తమ నేస్తాలు. మీరు మీ ఇన్హేలరును ప్రభావవంతంగా ఉపయోగించేందుకు మరియు మీ శ్వాస సమస్యను నియంత్రణలో ఉంచేందుకు మీకు సహాయపడే కొన్ని చిట్కాలను ఇక్కడ ఇస్తున్నాము. మీరు ఇన్హేలరును సరైన విధానంలో ఉపయోగిస్తున్నారని నిర్థారించుకునేందుకు రోగి సమాచార కరపత్రంలో ఇవ్వబడిన సూచనలను పాటించండి (ఇన్హేలర్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి).

 

చేయవలసినవి

  • తికమకపడకుండా ఉండేందుకు మీ కంట్రోలర్ మరియు రిలీవర్ ఇన్హేలర్లకు లేబుల్ అంటించండి.

  • ఇన్హేలర్ మౌత్ పీస్ ని మీ పెదవులతో మూసివేయడానికి ముందు సంపూర్ణంగా శ్వాస బయటకు వదలండి.

  • నోటి నుంచి ఇన్హేలర్ ని తీసిన తరువాత, మీరు దాదాపు 10 సెకన్ల సేపు లేదా మీకు సౌకర్యంగా ఉన్నంత సేపు మీ శ్వాసను బిగపట్టండి.

  • మరొక మోతాదు అవసరమైతే, రెండవ మోతాదును తీసుకోవడానికి ముందు కనీసం 1 నిమిషం సేపు వేచివుండండి.

  • మీ ఇన్హేలరులో మిగిలిపోయివున్న మోతాదుల సంఖ్యపై కన్నేసి ఉంచండి.

  • మోతాదు కౌంటర్ల విషయానికొస్తే, కొద్ది మోతాదులు మిగిలివున్నాయని సూచిస్తూ మోతాదు కౌంటరు రంగు ఆకుపచ్చ నుంచి ఎరుపు రంగులోకి మారినప్పుడు, కొత్త ఇన్హేలరును కొనే విషయం పరిగణించండి.

  • రోగి సమాచార పత్రంలో ఇవ్వబడిన క్లీనింగ్ మరియు వాషింగ్ సూచనలను పాటించండి.

  • ప్రయాణంలో ఉండగా మీ ఇన్హేలరును దాని అసలు ప్యాకేజిలో ఉంచి, మీ డాక్టరు ప్రిస్క్రిప్షనుతో పాటు వెంట తీసుకెళ్ళండి.

  • మీ డాక్టరుతో మాట్లాడి, ఇన్హేలర్ల గురించి మీకు గల ఏవైనా సందేహాలను నివృత్తి చేసుకోండి.

 

చేయకూడనివి-

  • మీ ఇన్హేలరులోకి శ్వాస వదలకండి

  • మోతాదు కౌంటర్ల విషయానికొస్తే, మోతాదు కౌంటరుపై ఉన్న నంబర్లను చెరపకండి.

  • గడువు ముగింపు తేదీ దాటిపోయాక ఇన్హేలరును ఉపయోగించకండి.

  • సిఫారసు చేసిన మోతాదుకు మించి మోతాదు తీసుకోకండి.