Inhalers A-Z

ఇన్హేలర్: కల్పితాలు మరియు వాస్తవాలు

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ప్రజలు శ్వాస సమస్యలకు చికిత్స చేసేందుకు ఇన్హేలర్లను అత్యంత ప్రభావవంతమైన మార్గంగా అంగీకరించగా, డివైసులను ఇప్పటికీ అనేక కల్పితాలు చుట్టుముడుతున్నాయి. కల్పితాల కారణంగానే ఇన్హలేషన్ థెరపి వారికి ఉత్తమమని చెప్పినప్పుడు కొంత మంది ప్రజలు తరచుగా కాస్తంత కంగారుపడుతుంటారు. అయితే, ఇన్హేలర్లను ఉపయోగించడం సురక్షితం మరియు ప్రభావవంతం, కాబట్టి ఎలాంటి చింత లేకుండానే మీరు వీటిని ఉపయోగిస్తూనే ఉండొచ్చు.

ఇన్హేలర్ల విషయానికొస్తే ప్రజలకు ఉండే కొన్ని మామూలు కల్పితాలు ఇవి:

కల్పితం #1 - ఇన్హేలర్లు అడిక్షన్ కలిగిస్తాయి

చాలామంది నమ్ముతున్నప్పటికీ, ఇన్హేలర్లను క్రమంతప్పకుండా ఉపయోగిస్తే మీరు వాటికి బానిసలవుతారని అర్థం కాదు. ఇన్హేలర్లలో ఉపయోగించే మందుకు అలవాటు పడే గుణం లేదు. ముందుగానే నిలిపివేస్తే లక్షణాలు తిరిగి కనిపించడం కలిగించవచ్చు. సరళంగా చెప్పాలంటే, ఆస్తమా మరియు సిఒపిడి లాంటి శ్వాస సమస్యలకు చికిత్స చేయడానికి ఇన్హేలర్ల ఆవశ్యకత ఉంది మరియు అడిక్షన్ కలిగించవు. మీ డాక్టరు సూచించినంత కాలం మీరు ఇన్హేలర్లను ఉపయోగించాలి.

కల్పితం #2 – ఇన్హేలర్స్ని ఉపయోగించడం పిల్లల వృద్ధిని గిడసబారేలా చేస్తాయి

ఇన్హేలర్ల విషయంలో ఇది అత్యంత సామాన్యమైన అపోహ. ఇన్హేలర్ల వల్ల కలుగుతాయని తెలిసిన దుష్ప్రభావాలు లేవు, ఎందుకంటే ఊపిరితిత్తుల్లోకి డెలివర్ చేయబడే మందు చాలా చిన్న మొత్తాల్లో ఉంటుంది కాబట్టి. నిజానికి, క్రమంతప్పకుండా మరియు నిర్ణీత మోతాదుల్లో తీసుకున్నప్పుడు, శ్వాస సమస్యలకు చికిత్స చేసేందుకు ఇన్హేలర్లు సురక్షిత రకమైన మందులు. సాధారణ నమ్మకానికి విరుద్ధంగా, తమ శ్వాస సమస్యలకు చికిత్స చేయించుకునేందుకు క్రమంతప్పకుండా ఇన్హేలర్లను ఉపయోగించే పిల్లలు మామూలు పెద్దలు పెరిగినట్లుగానే ఎత్తు పెరుగుతారు.

కల్పితం #3 - పీల్చుకునే స్టీరాయిడ్లు హానికరమైనవి

మీరు ఇన్హేలరును ఉపయోగించినప్పుడు, సమస్యాత్మక ప్రాంతమైన ఊపిరితిత్తుల్లోకి మందు నేరుగా చేరుకుంటుంది. కాబట్టి, ఇన్హేలరు ద్వారా ఊపిరితిత్తుల్లోకి పంపే మందు పరిమాణం చాలా కొద్దిగా ఉంటుంది. ఇలాంటి కొద్ది మొత్తాలు ఎలాంటి హాని కలిగించవు. పిల్లలు మరియు గర్భిణీలతో సహా ప్రతి ఒక్కరూ ఇన్హేలర్లను సురక్షితంగా తీసుకోవచ్చు. ఇంకా, ఇన్హేలర్ మందులో ఉపయోగించిన స్టీరాయిడ్ రకం అథ్లెట్స్ మరియు బాడీ బిల్డర్లు తమ పనితీరును మెరుగుపరచుకునేందుకు ఉపయోగించే వాటి మాదిరిగా ఉండదు. కాబట్టి, ఇన్హేలర్ల కారణంగా మీకు ఏదో ఒక రకం దుష్ప్రభావం కలిగే అవకాశం దాదాపుగా జీరో ఉంటుంది. నిజం చెప్పాలంటే, మీ ఇన్హేలర్ ని రెగ్యులరుగా తీసుకోకపోవడం కంటే తీసుకోవడం వల్ల హాని కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

కల్పితం #4 - ఇన్హేలర్లు ఆఖరి ప్రయత్నంగా వాడాలి

ఆస్తమా మరియు సిఒపిడి లాంటి శ్వాస సమస్యలకు చికిత్స చేసేందుకు ఇన్హేలర్లు మొదటి నుంచి వాడే మందు తప్ప ఆఖరివి కావు. ప్రపంచవ్యాప్తంగా, అత్యధిక శ్వాస సమస్యలకు చికిత్స చేసేందుకు ఇన్హేలర్లు అత్యంత ప్రభావవంతమైన, సురక్షితమైన మరియు సౌలభ్యమైన చికిత్స మార్గంగా ఉన్నాయి. వెంటనే మరియు ఎక్కువ సమయం ఉపశమనం కల్పించేందుకు, సమస్యాత్మక ప్రాంతాలైన ఊపిరితిత్తులు మరియు వాయుమార్గాలకు నేరుగా మందు చేరుకోవడాన్ని ఇన్హేలర్లు సాధ్యం చేస్తాయి. ఆస్తమా మరియు సిఒపిడి లాంటి మీ శ్వాస సమస్యలకు చికిత్స చేయడానికి ఇన్హలేషన్ థెరపి అత్యంత ప్రభావవంతమైన మార్గం, కాబట్టి మీకు ఇష్టమైన మరియు ఆనందం కలిగించే పనిని కొనసాగించవచ్చు మరియు ఎలాంటి చీకూచింతా లేకుండా మామూలు క్రియాశీల జీవితం జీవించవచ్చు.